TANA
Telangana Tourism
Katamarayudu

అట్లాంటాలో జే తాళ్ళూరి ప్యానెల్ ప్రచారానికి మంచి స్పందన

19-03-2017

అట్లాంటాలో జే తాళ్ళూరి ప్యానెల్ ప్రచారానికి మంచి స్పందన

తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ పదవికి పోటీ పడుతున్న జే తాళ్ళూరి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్యానెల్‌ సభ్యులు వివిధ నగరాల్లో ముమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అట్లాంటాలో జరిగిన ప్రచార కార్యక్రమానికి స్థానిక తెలుగువాళ్ళు  హాజరై మద్దతును ప్రకటించారు. ఈ ప్యానెల్‌లో రవి పొట్లూరి, లావు అంజయ్య చౌదరి, భరత్‌ మద్దినేని, జగదీశ్‌ ప్రభల, శ్రీనివాస్‌ కొడాలి ఉన్నారు. తానా నాయకుడు సతీష్‌ వేమన, గంగాధర్‌ నాదెళ్ళ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు.