జాక్సన్ విల్లేలో జే తాళ్ళూరి ప్రచారం
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

జాక్సన్ విల్లేలో జే తాళ్ళూరి ప్రచారం

19-03-2017

జాక్సన్ విల్లేలో జే తాళ్ళూరి ప్రచారం

తానా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ పదవికి పోటీ పడుతున్న జే తాళ్ళూరి ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్‌విల్లే నగరంలోని తానా అభిమానులతో, మిత్రులతో సమావేశమయ్యారు. స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో ఏర్పాటు  చేసిన ఈ సమావేశానికి 150మందికిపైగా హాజరయ్యారు. తానా అధ్యక్ష అభ్యర్థిగా తాను బరిలో నిలవబడటానికి గల ఏకైక కారణం సేవ చేయడం మాత్రమేనని, అది కూడా పారదర్శకతతో అందరినీ కలుపుకుపోతూ చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక తానా ప్రతినిదులు శ్రీని పచ్చా, సురేష్‌ మిట్టపల్లి, అనిల్‌ యార్లగడ్డ, సాయి కాట్రగడ్డతోపాటు తానా సభ్యులు బాబు కొర్రపాటి, కళ్యాణ్‌ కండ్లకుంట, సుధీర్‌ కొండబ్రోలు, చెరుకూరి శ్రీనివాస్‌, ఇంద్రిజిత్‌ కట్టా, వెంకట్‌ పాములపాటి, వెంకన్న కరణం, సునీల్‌ తేగుళ్ళ, మధు గబ్బిట, డా. అశ్విన్‌ దావులూరి, దయానంద్‌ బురంశెట్టి (ఆటా డైరెక్టర్‌), కీర్తిధర్‌ గౌడ్‌, మహేష్‌బచు, అనిల్‌ యాద, పాపారావు గుమ్మదపు, రాజేష్‌ చందుపట్ల, శ్రీ శర్మ, ప్రవీణ్‌ తొదుపునూరి పాల్గొన్నారు.