సౌరశక్తి ప్రాజెక్టును చేపట్టిన తానా ఫౌండేషన్
Ramakrishna

సౌరశక్తి ప్రాజెక్టును చేపట్టిన తానా ఫౌండేషన్

19-03-2017

సౌరశక్తి ప్రాజెక్టును చేపట్టిన తానా ఫౌండేషన్

తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్న సహాయ కార్యక్రమాల్లో భాగంగా విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం అన్నవరం గ్రామంలో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రభుత్వంతో సమన్వయం నిర్వహించి ఈ ప్రాజెక్టుకి అయ్యే ఖర్చులో 50శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం  భరించేవిధంగా ఒప్పందం కుదిర్చారు. మిగిలిన 50శాతాన్ని తానా ఫౌండేషన్‌ భరిస్తుందని ఈ ప్రాజెక్టు ద్వారా అన్నవరం గ్రామంలో సౌరశక్తి సాకల్యంగా కాంతులీనుంతుందని ప్రాజెక్టు సమన్వయకర్త, తానా ఫౌండేషన్‌ కార్యదర్శి డా.నల్లూరి ప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. పాలడుగు శ్రీకాంత్‌తో సహా సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్టుకు మాటా వ్యాలీ తెలుగు  సంఘం సహకారం అందిస్తోంది.