డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన

డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన

09-01-2020

డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన

ఇరాన్‌తో తాజా ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌ క్షిపణి దాడిలో అమెరికా సైనికులు చనిపోలేదని ఆయన సృష్టం చేశారు. ముందస్తు చర్యల కారణంగా రెండు వైపుల ప్రాణాలు కాపాడగలిగామని, సైనికులంతా సురక్షితంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల్లో ఇరాన్‌ ముందు ఉందని ట్రంప్‌ ఆరోపించారు. గత వారం అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులను మట్టుబెట్టామని ఆయన చెప్పారు. సులేమానీని చంపాల్సిందని, ఇప్పటికే ఆలస్యం చేశామని ఆయన చెప్పారు. ఇరాన్‌ అందరి ముందు దోషిగా నిలబడిందని ట్రంప్‌ అంటూ, ఎటువంటి చర్యకైనా తాము సిద్ధమని ప్రకటించారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఇరాన్‌కు అణ్వాయుధం దక్కనీయనని ఆయన సృష్టం చేశారు. ఇరాన్‌ ప్రవర్తనలో మార్పు రానంత కాలం ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్‌ సృష్టం చేశారు.