వచ్చే వారం భారత్‌కు జెఫ్‌ బెజోస్‌

వచ్చే వారం భారత్‌కు జెఫ్‌ బెజోస్‌

10-01-2020

వచ్చే వారం భారత్‌కు జెఫ్‌ బెజోస్‌

అమెరికాకు చెందిన ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వ్వవస్థాపకుడు, సీఈవో జెఫ్‌ బెజోస్‌ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పరిశ్రమ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి. జనవరి 15-16 తేదీల్లో రాజధానిలో జరిగిన చిన్న, మధ్యతరహా వ్యాపారాల కార్యక్రమానికి కూడా ఆయన హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. దీనిపై అమెజాన్‌ మీడియా సంప్రదించగా ఎలాంటి స్పందన రాలేదు.