ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలకు అమెరికా సిద్ధం

ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలకు అమెరికా సిద్ధం

11-01-2020

ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలకు అమెరికా సిద్ధం

ఇరాన్‌పై గరంగరంగా ఉన్న అమెరికా ఆ దేశాన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టడమే లక్ష్యంగా మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్దమైంది. ఇరాన్‌తో జౌళి, నిర్మాణ, ఉత్పత్తి, గనుల రంగాల్లో ఎవరూ సంబంధాలు ఏర్పరుచుకోకుండా నిషేధాజ్ఞలు విధిస్తూ తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తెలిపారు. ఉక్కు, ఇనుము తదితర రంగాలకు సంబంధించి విడిగా ఆంక్షలు విధిస్తామని చెప్పారు.