భారతీయ యువతకు కొత్త తలనొప్పులు

భారతీయ యువతకు కొత్త తలనొప్పులు

11-01-2020

భారతీయ యువతకు కొత్త తలనొప్పులు

అమెరికాలో వీసా నిబంధనలు భారతీయులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. 21 ఏళ్లు పైబడిన వయసున్న తమ పిల్లల హక్కుల కోసం అక్కడి భారతీయులు కోర్టును ఆశ్రయించారు. అమెరికాలోని వీసా నిబంధనల ప్రకారం.. హెచ్‌1 బీ వీసాలపై పనిచేస్తున్న వ్యక్తుల జీవిత భాగస్వాములు, వారి 21 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు అక్కడి ప్రభుత్వం హెచ్‌ 4 వీసాను జారీ చేస్తుంది. 21 ఏళ్లు దాటిన తర్వాత కూడా చదువుకుంటున్న పిల్లలు ఎఫ్‌ 1 వీసా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చిక్కంతా ఇక్కడే ఉంది. హెచ్‌ 1 బీ వీసాలపై పని చేస్తున్న చాలా మంది భారతీయుల పిల్లలకు 21 ఏళ్లు దాటాయి. ఇప్పుడు వారి చదువు వివిధ దశల్లో ఉంది. ఇప్పుడు వారంతా హెచ్‌4 వీసా కిందకురారు. వీళ్లంతా ఎఫ్‌ 1 వీసాను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎఫ్‌ 1 వీసా కోటాలో భాగంగా భారతీయులకు అక్కడి ప్రభుత్వం తక్కువ వీసాలను జారీ చేస్తుంది. దీంతో ఎంత మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 21 ఏళ్లపైడిన వయస్సున్న పిల్లల తల్లిదండ్రులు తమ హక్కుల కోసం పోరాడుతూ కోర్టును ఆశ్రయించారు.