ఘనంగా సాయి దత్త పీఠం 3 వ వార్షికోత్సవాలు
MarinaSkies
Kizen
APEDB

ఘనంగా సాయి దత్త పీఠం 3 వ వార్షికోత్సవాలు

19-03-2017

ఘనంగా సాయి దత్త పీఠం 3 వ వార్షికోత్సవాలు

లలిత సహస్ర నామ పారాయణానికి విశేష స్పందన 

అమెరికా న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం మూడవ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఐదు రోజుల పాటు జరిగే ఈ వార్షికోత్సవాలకు తొలి రోజే భక్తుల నుంచి మంచి స్పందన లభించింది. ఐదు రోజుల పాటు అనేక ఆధ్యాత్మిక, భక్తి కార్యక్రమాలను సాయి దత్త పీఠం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే తొలి రోజు లలిత సహస్ర నామ పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. చాలా మంది మహిళా భక్తులు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో శ్రద్ధాసక్తులతో లలితా నామాన్ని పారాయణం చేశారు.. వేదపండితులు ఈ సహస్ర నామ పారాయణాన్ని దగ్గరుండి మహిళల చేత చేయించారు. లలితా సహస్ర నామ పారాయణం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలను వేద పండితులు వివరించారు.. సాయి దత్త  పీఠంలో ఈ ఐదు రోజులు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి సంగీత విభావరులు ఉంటాయని సాయి దత్త పీఠం తెలిపింది. అమెరికాలో ఉండే భక్త జనం అంతా ఈ వార్షికోత్సవాల్లో పాల్గొనాలని దత్త పీఠం పిలుపునిచ్చింది. 

రెండవ రోజు,  భక్తులచే ఉదయం సంతాన సామూహిక పాశుపత హోమం, సామూహిక షణ్ముఖ హోమం, నవగ్రహాలకు సామూహిక అర్చన, రామ తారక మూల మంత్ర హోమం, ఆంజనేయ హోమం, భక్తులు ఇంటివద్ద భక్తి తో చేసి తీసుకువచ్చిన 1008 వడలతో 1008  తమలపాకులతో ఆంజనేయునికి మాల ధారణ జరిగింది. 

మధ్యాహ్నం, నబనీత చక్రబర్తి తన శిష్యులతో కలసి బెంగాలీ భజన్స్ తో అలరించారు.

సాయంత్రం,న్యూ జెర్సీ అసెంబ్లీ విమెన్ నాన్సీ.జె.పింకెన్ విచ్చేసి సాయి దత్త పీఠం గత మూడు సంవత్సరాలుగా పీఠం లో చేస్తూన్న కమ్యూనిటీ సర్వీసెస్, చారిటీ సర్వీసెస్ గురించి  ఎంతగానో మెచ్చుకుని తనపరంగా ఎటువంటి సహాయం కావాలన్న కలవాలని సూచించారు.

న్యూ జెర్సీ లో తలపెట్టిన "షిర్డీ ఇన్ అమెరికా" స్థల సేకరణ దాదాపు పూర్తి కావస్తున్న సందర్భంలో అభినందిస్తూ, త్వరలో భూమి పూజ కార్యక్రమం చేసుకుని నిర్మాణ కార్యక్రమం చేపట్టాలని అభిలషించారు. 

కుమారి. శృతి నండూరి చే క్లాసికల్ భక్తి గీతాలాపన ఆహూతులను అలరించింది. రాత్రి, ప్రసాద్ సింహాద్రి తన శిష్య బృందంతో భక్తి గీతాలాపన తో భక్తులు ఆనంద పారవశ్యం చెందారు. బాబా ఆరతి తో ఈ రోజు కార్యక్రామాలు ముగిసాయి.