అర్కాన్సస్‌లో అరుదైన వజ్రం లభ్యం
MarinaSkies
Kizen
APEDB

అర్కాన్సస్‌లో అరుదైన వజ్రం లభ్యం

20-03-2017

అర్కాన్సస్‌లో అరుదైన వజ్రం లభ్యం

అమెరికాలోని ఓ పార్కు 14 ఏండ్ల బాలుడికి అరుదైన బ్రౌన్‌ డైమండ్‌ లభించింది. 7.44  క్యారట్ల ఈ స్టోన్‌ దాదాపు 40 ఏండ్ల కాలంలో లభ్యమైన అతిపెద్ద వజ్రమని భావిస్తున్నారు. దీనికి సూపర్‌ మ్యాన్స్‌డైమండ్‌ అని పేరు పెట్టారు. ఇది పార్కులో లభించిన ఏడో అతి పెద్ద వజ్రమని ఆర్కన్సాస్‌ లోని  క్రేటర్‌ ఆఫ్‌ డైమండ్స్‌ స్టేట్‌ పార్క్‌ అధికారులు తెలిపారు. 14 ఏండ్ల కాలెల్‌ లాంగ్‌ఫార్డ్‌ తన తండ్రితో కలిసి పార్కులో తిరుగుతుండగా ఒకచోట మెరుస్తున్న ఈ డార్క్‌ బ్రౌన్‌ డైమండ్‌ కనిపించింది. చిన్న సెలయేటి ప్రవాహానికి కొన్ని అంగుళాల దూరంలోనే ఒక రాళ్లకుప్పలో దానిని చూశాను అని లాంగ్‌ఫార్డ్‌ చెప్పాడు. భారీ వర్షాల వల్ల పెద్ద వజ్రాల బయటపడుతుంటాయి. లోహాల వలె మెరిసే వీటిని గుర్తించడం సులువే అని పార్క్‌ ప్రతినిధి వేమాన్‌ కాక్స్‌ తెలిపారు.