TANA
Telangana Tourism
Katamarayudu

సౌమ్యా స్వామినాథన్‌కు అరుదైన గౌరవం

20-03-2017

సౌమ్యా స్వామినాథన్‌కు అరుదైన గౌరవం

ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌(57)కు అరుదైన గౌరవం దక్కింది. మందులకు లొంగని సూపర్‌బగ్‌లపై పరిశోధనలకు సలహాలందించే హైపవర్‌ కమిటీలో ఆమెను చేరుస్తూ ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటరస్‌ నిర్ణయం తీసుకున్నారు. సామ్య ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్‌ రీసెర్చ్‌ విభాగంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భారత హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్‌ కూతురు.