గోదావరి జిల్లాలవాసులం మేము...

గోదావరి జిల్లాలవాసులం మేము...

02-06-2017

గోదావరి జిల్లాలవాసులం మేము...

సెయింట్‌ లూయిస్‌ నగరంలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 21వ మహాసభల్లో ఉభయ గోదావరి జిల్లాల ఎన్నారైల రెండవ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య శాఖామాత్యులు కామినేని శ్రీనివాస్‌, రాజమండ్రి పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళిమోహన్‌, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్తు చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు, సినీ నిర్మాత అల్లు అరవింద్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు,  ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అధికారి (ఐసీ -స్పెషల్‌ క్యాడర్‌) ఎం.కాంతారావు, మాజీ ఆంధ్రా  క్రికెట్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ చాముండేశ్వరినాథ్‌, తానా పూర్వ అధ్యక్షులు కోమటి జయరాం, జంపాల చౌదరి,  అధ్యక్షుడు  వేమన సతీష్‌, తానా కార్వనిర్వాహక ఉపాధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌, లూసియానాకు చెందిన ప్రముఖ వైద్యులు డా.రాజా తాళ్లూరి, ప్రముఖ సినీ  దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సినీ దర్శకుడు వీరభద్రం చౌదరి, డాక్టర్‌ నల్లూరి ప్రసాద్‌, డా. అడపా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

అతిథులు ప్రసంగిస్తూ గోదావరి జిల్లాలతో తమకు గల అనుబంధాన్ని జిల్లాల ప్రాముఖ్యాన్ని తమ తరపున ప్రజలకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించగలరో వివరించారు. క్యాన్సర్‌ నిర్థారణ పరీక్షల పరికరాలకు ఆర్థిక సాయం ప్రకటించిన మురళీమోహన్‌కు అల్లు అరవింద్‌ చాముండేశ్వరినాథ్‌లు తమ తోడ్పాటును ప్రకటించారు.

పశ్చిమ గోదావరి జల్లా పరిషత్తు చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు మాట్లాడుతూ ప్రవాసులు ప్రభుత్వం సమన్వయం వలన అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి అవుతాయని, దీనికి గోదావరి జిల్లాల ప్రవాసలు సాయపడవల్సిందిగా కోరారు. ఓ  ప్రత్యేక అధికారిని ఈ కార్యక్రమాలకు పర్యవేక్షకుడిగా నియమించడానికి తాను ఏర్పాట్లు చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ వైద్యురాలు డా. గాయత్రీ తాళ్లూరిని మాగంటి మురళీమోహన్‌, సినీ నిర్మాత అల్లు అరవింద్‌, ముళ్ళపూడి బాపిరాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు, చాముండేశ్వరినాథ్‌, తదితరులు సన్మానించారు.  దర్శకుడు కె.రాఘవేంద్రరావు అమెరికాలో పుట్టిన తెలుగు సంతతి అభ్యర్థి గోదావరి జిల్ల అబ్బాయి రోనీ ఆకురాతిని సన్మానించారు. సమ్మేళనంలో పాల్గొన్న ప్రముఖులను గోదావరి ప్రవాసుల సంఘం వ్యవస్థాపక సభ్యులు సుబ్బా యంత్ర, సత్యనారాయణ మన్నే, సుమంత్‌ పుసులూరి, కిషోర్‌ తమ్మినీడి, సతీష్‌ మేకా, రాంప్రసాద్‌ చిలుకూరి తదితరులు జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సమ్మేళనం విజయవంతానికి సాయపడిన సురేన్‌ పాతూరి, ఈమేష్‌ గుత్తా, విద్యా గారపాటి, జనార్థన్‌ నిమ్మలపూడి, కృష్ణారావు కొర్రపాటి, వీర చెల్లూరి, నగేష్‌ మన్నే,  సతీష్‌ చుండ్రు, తదితరులకు సంస్థ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.


Click here for Event Gallery