TANA
Telangana Tourism
Karur Vysya Bank

ప్రవాస భారతీయుడికి అరుదైన గౌరవం

20-03-2017

ప్రవాస భారతీయుడికి అరుదైన గౌరవం

అమెరికాలో మరో ప్రవాస భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. హ్యూస్టన్‌ నగర ప్రజాపనులు, ఇంజనీరింగ్‌ సారథిగా ఇండో అమెరికన్‌ కరుణ శ్రీరామ్‌ ఎంపికయ్యారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీరామ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ రూర్కీలో మాస్టర్స్‌ చేశారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిస్సోరీలో సిలిల్‌ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సమర్థతను గుర్తించిన హ్యూస్టన్‌ నగర మేయర్‌ కీలకమైన ప్రజాపనులు, ఇంజనీరింగ్‌ సారథిగా శ్రీరామను ఎంపిక చేశారు. కౌన్సిల్‌ ఆమోదం పొందాల్సి ఉంది.