వైట్‌హౌస్‌ కు బాంబు బెదిరింపు
Kizen
APEDB

వైట్‌హౌస్‌ కు బాంబు బెదిరింపు

20-03-2017

వైట్‌హౌస్‌ కు బాంబు బెదిరింపు

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వద్ద శనివారం రాత్రి బాంబు బెదిరింపు కలకలం రేపింంది.  బాంబు దాడిచేపడతానని హెచ్చరించడంతో ఓ వ్యక్తిని భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. భద్రతనూ పెంచాయి. వైట్‌హౌస్‌  పరిసరాల్లోకి కారులో వచ్చిన ఓ వ్యక్తిని చెక్‌పోస్ట్‌ వద్ద అడ్డగించినట్లు అధికారులు తెలిపారు. కారులో బాంబులు ఉన్నాయని, దాడిచేపడతానని అతడు చెప్పడంతో వెంటనే అతణ్ని అరెస్టుచేశామన్నారు. శనివారం రాత్రి 11 గంటలకు ఈ ఘటన జరిగింది. 15వ మార్గం వరకూ అతడు కారులో వచ్చాడు. ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్‌ ఫ్లోరిడాకు వెళ్లారు అని అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ (యూఎస్‌ఎస్‌సీ) విభాగం అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనకు కొన్ని గంటముందే శ్వేతసౌధ కంచె పరిసరాల్లోకి సమీపించేందుకు ఓ వ్యక్తి వాహనాలు నిలపే నిర్మాణాన్ని ఎక్కుతూ కనిపించారు. అతణ్ని కూడా అధికారులు అరెస్టు చేశారు. అయితే ఇద్దరు నిందితుల దగ్గరా ఎలాంటి ఆయుధాలులేవని శ్వేతసౌధ వర్గాలు తెలిపాయి.