భారతీయ అమెరికన్‌కు కెరీర్‌ అవార్డు
Kizen
APEDB

భారతీయ అమెరికన్‌కు కెరీర్‌ అవార్డు

20-03-2017

భారతీయ అమెరికన్‌కు కెరీర్‌ అవార్డు

అమెరికా జాతీయ సైన్స్‌ ఫౌండేషన్‌(ఎన్‌ఎస్‌ఎఫ్‌) అందించే ప్రతిష్ఠాత్మక కెరీర్‌ అవార్డును భారతీయ అమెరికన్‌ శాస్త్రవేత్త అన్షుమాలి శ్రీవాస్తవ గెల్చుకున్నారు. కంప్యూటర్లలో వినియోగించేందుకు వీలుగా సరికొత్త క్రమసూత్ర పద్ధతులను రూపొందించినందుకుగాను ఆయనకు ఈ  అవార్డు దక్కింది. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- ఖరగ్‌పూర్‌ పూర్వ విద్యార్థి అయిన శ్రీవాస్తవ, ప్రస్తుతం రైస్‌ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. పరిశోధనలు, విద్యారంగ అభివృద్ధికిగాను ఎన్‌ఎస్‌ఎఫ్‌ ఏటా 400 మందికి కెరీర్‌ అవార్డులను అందిస్తుంటుంది.