అయస్కాంత ప్రేరణతో కుంగుబాటుకు చెక్‌!
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

అయస్కాంత ప్రేరణతో కుంగుబాటుకు చెక్‌!

15-06-2017

అయస్కాంత ప్రేరణతో కుంగుబాటుకు చెక్‌!

కుంగుబాటుతో బాధపడుతున్నారా? సాధారణ ఔషధాలు, చికిత్సలు సరైన ఫలితాలనివ్వడం లేదా? ఏం ఫర్వాలేదు. అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు చక్కని పరిష్కారంతో ముందుకు వచ్చారు. ట్రాన్స్‌క్రేనియల్‌ మేగ్నిటిక్‌స్టిములేషన్‌ (టీఎంఎస్‌) పేరిట వారు ఓ అధునాతన చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు. దీనిలో మొదట రోగి మెదడును స్కానింగ్‌ చేస్తారు. అనంతరం ప్రభావిత ప్రాంతాలను గుర్తించి, అక్కడ అయస్కాంత తరంగాలను ప్రసరింపచేస్తారు. ఫలితంగా రోగుల మెదడు అనుసంధానాల్లో మార్పులు చోటుచేసుకుని కుంగుబాటును అడ్డుకట్ట పడుతుంది. ఈ చికిత్సను వారంలో కొన్ని రోజులు 30 నిమిషాల చొప్పున ఆరు నెలలపాటు తీసుకోవాల్సి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. దీన్ని తీసుకునేటప్పుడు తలపై ఎవరో తడుతున్న భావన కలుగుతుందని వివరించారు. మూర్ఛ, పార్కిన్సన్స్‌, మనోవైకల్యం తదితర రుగ్మతలపైనా ఈ చికిత్స ప్రభావాన్ని గుర్తించేందుకు ప్రస్తుతం పరిశోధనలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.