అమెరికా వడ్డీ రేట్లు పెంపు
MarinaSkies
Kizen
APEDB

అమెరికా వడ్డీ రేట్లు పెంపు

15-06-2017

అమెరికా వడ్డీ రేట్లు పెంపు

అందరూ ఊహించినట్లుగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పావు శాతం పెంచింది. ఇకపై వడ్డీ రేట్ల కొత్త శ్రేణి1-1. 25 శాతంగా ఉండనుంది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు వడ్డీ రేట్లను రెండు సార్లు పెంచినట్లయింది. మార్చిలో కూడా  వడ్డీ రేట్లను 0.25 శాతం మేర పెంచిన సంగతి విదితమే. తాజాగా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాన్ని రెండు రోజుల సమావేశం అనంతరం ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ ప్రకటించింది. యూఎస్‌ఫెడ్‌ చైర్మన్‌ జానెట్‌ యెలెన్‌ భవిష్యత్‌ రేట్లపై, అమెరికా ఆర్థిక వ్యవస్థపై చేసే వ్యాఖ్యలు భారత్‌ సహా అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి.