ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ లో విరాళాల సేకరణ, వితరణకు వీలు కల్పించే సదుపాయం కొన్ని వారాల్లో అమెరికా యూజర్లకు అందుబాటులోకి రానుంది. 2014 నుంచి వినియోగంలో ఉన్న సేఫ్టీ చెక్ సదుపాయానికే దీనిని జోడించనున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. ఇది అందుబాటులోకి వస్తే ప్రకృతి వైపరీత్యాలు, హింసాత్మక దాడుల బాధితుల సహాయం పొందడం తేలికవుతుందని చెప్పింది.