ఖతార్ తో అమెరికా ఒప్పందం
APEDB
Ramakrishna

ఖతార్ తో అమెరికా ఒప్పందం

15-06-2017

ఖతార్ తో అమెరికా ఒప్పందం

ఉగ్రవాదానికి మద్దతిస్తుందంటూ అరబ్‌ దేశాలు ఖతార్‌తో తెగదెంపులు చేసుకోగా, అగ్రరాజ్యం అమెరికా మాత్రం ఆ దేశానికి దౌత్యపరమైన మద్దతిస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికాలో తయారైన ఎఫ్‌ 15 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి ఆ దేశంలో ఖతార్‌ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికా రక్షణ శాఖ మంత్రి జిమ్‌ మాట్టిస్‌, ఖతార్‌ రక్షణ మంత్రి ఖాలిద్‌ అల్‌ అత్తియాహ్‌ 12 బిలియన్‌ డాలర్లతో ఎఫ్‌ 15 యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. ఖతార్‌ దేశంలో గల్ఫ్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నదంటూ ఖతార్‌ పొరుగుదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఒప్పందం కుదరడం గమనార్హం.