స్టీవ్‌ స్కాలైన్‌ను పరామర్శించిన ట్రంప్

స్టీవ్‌ స్కాలైన్‌ను పరామర్శించిన ట్రంప్

15-06-2017

స్టీవ్‌ స్కాలైన్‌ను పరామర్శించిన ట్రంప్

అమెరికా శాసనకర్తలపై జరిగిన కాల్పులో తీవ్రంగా గాయపడిన సీనియర్‌ కాంగ్రెస్‌ సభ్యుడు స్టీవ్‌ స్కాలైన్‌ను ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ పరామర్శించారు. అలెగ్జాండ్రియాలో సిటీ ఆసుపత్రిలో ట్రంప్‌ దంపతులు పుష్పగుచ్చం ఇచ్చి స్టీవ్‌ స్కాలైన్‌ను పరామర్శించినట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి సీన్‌ స్పైసర్‌ తెలిపారు. స్కాలైన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులతోనూ ట్రంప్‌ ప్రత్యేకంగా మాట్లాడి, ఆయన పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. స్టీవ్‌ స్కాలైస్‌ చాలా గొప్ప వ్యక్తి. ప్రస్తుతం విషమ పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన త్వరలోనే కోలుకోవాలని ప్రార్థిస్తూన్నా అని ట్రంప్‌ అన్నారు.