రష్యాపై తాజా ఆంక్షలకు అమెరికా సెనేట్‌ ఆమోదం
APEDB
Ramakrishna

రష్యాపై తాజా ఆంక్షలకు అమెరికా సెనేట్‌ ఆమోదం

16-06-2017

రష్యాపై తాజా ఆంక్షలకు అమెరికా సెనేట్‌ ఆమోదం

రష్యాపై తాజాగా ఆంక్షలు విధిస్తూ అమెరికా సెనేట్‌ సవరణ బిల్లును ఆమోదించింది. క్రిమియాలో ప్రాదేశిక ఉల్లంఘనకు, సిరియాలో దూకుడుకు రష్యా పాల్పడకుండా అమెరికా శక్తిమంతమైన హెచ్చరిక జారీచేసినట్లయ్యింది. సెనేట్‌లో 97 మంది సభ్యులు అనుకూలంగా ఓటేయగా ఇద్దరు రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకించారు. ప్రజాప్రతినిధుల సభ ఆమోదంతో పాటు అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం తర్వాతే బిల్లు చట్టంగా మారనుంది.