డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రశ్నిస్తారా?
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రశ్నిస్తారా?

16-06-2017

డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రశ్నిస్తారా?

న్యాయ విచారణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విఘాతం కల్గించారా? లేదా అన్న కోణంలో ప్రత్యేక కౌన్సిల్‌ విచారణ కొనసాగిస్తుందని అమెరికన్‌ మీడియా పేర్కొంది. ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ రాబర్ట్‌ ముల్లర్‌ నేతృత్వంలోని ప్రత్యేక కౌన్సిల్‌ 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. వాషింగ్టన్‌ పోస్టు కథనం ప్రకారం ఈ కౌన్సిల్‌ ఇంతవరకూ అధ్యక్ష ఎన్నికల ప్రచారం లో రష్యా పాత్రపై విచారణ నిర్వహించిందని, ప్రస్తుతం ట్రంప్‌ ప్రచార బృందానికి,  క్రైమ్లిన్‌కు సంబంధాలున్నాయా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ట్రంప్‌ సహాయకుల ఆర్థిక నేరాలకు సంబంధించి ఆధారాలపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు పేర్కొంది.