అమెరికాలో పెన్నార్‌ జాయింట్‌ వెంచర్‌ సంస్థ!
Nela Ticket
Kizen
APEDB

అమెరికాలో పెన్నార్‌ జాయింట్‌ వెంచర్‌ సంస్థ!

16-06-2017

అమెరికాలో పెన్నార్‌ జాయింట్‌ వెంచర్‌ సంస్థ!

అమెరికాలో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. ఉత్పత్తుల సరఫరా, సర్వీసుల కోసం చెరిసంగం భాగస్వామ్యంలో ఈ జాయింట్‌ వెంచర్‌ను నెలకొల్పాలని చూస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ భాగస్వామ్య సంస్థకు సంబంధించి ఎలాంటి వివరాలను పెన్నార్‌ వెల్లడించలేదు. అంతేకాకుండా ఎవరితో కలిసి ఈ జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయనుందో కూడా కంపెనీ వెల్లడించలేదు. ఈ భాగస్వామ్య సంస్థ ఇరు కంపెనీల మార్కెట్‌ వాటాను పెంచటంతో పాటు రాబడులు, లాభాదాయకతను మాత్రం పెంచుతాయని పేర్కొంది. ఇంజనీరింగ్‌ సర్వీసులు, సేవలను అందించటంలో పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ కీలకంగా ఉంది.