నాట్స్‌ సంబరాల సారధులు...

నాట్స్‌ సంబరాల సారధులు...

17-06-2017

నాట్స్‌ సంబరాల సారధులు...

చికాగోలో నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌ (నాట్స్‌) ఆధ్వర్యంలో జూన్‌ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు జరగనున్న 5వ అమెరికా తెలుగు సంబరాలకు అంతా సిద్ధమవుతోంది. ఈ సంబరాల నిర్వహణ కోసం కమిటీలను కూడా నాట్స్‌ నియమించింది. స్థానిక తెలుగు సంఘం చికాగో తెలుగు అసోసియేషన్‌ కూడా ఈ సంబరాల నిర్వహణలో కీలకపాత్రను పోషిస్తోంది. స్థానికంగా ఉండే తెలుగువారిని భాగస్వాములను చేస్తూ అనేక కార్యక్రమాలను రూపొందించారు. సంగీతం, సాహిత్యం, వినోదం, విందుతోపాటు ప్రముఖులతో చర్చాగోష్టులతో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సంబరాలకు అమెరికా నలుమూలల నుంచే కాక, మాతృరాష్ట్రం నుంచి వచ్చే ప్రముఖుల ఆతిధ్యానికి లోటు లేకుంటా సంబరాల టీమ్‌ ఏర్పాట్లు చేసింది. సంబరాల కన్వీనర్‌ రవి అచంట ఆధ్వర్యంలో అనేక బృందాలు ఇప్పటికే తమకు అప్పగించిన పనులను పూర్తి చేస్తున్నాయి.

సంబరాల కమిటీల వివరాలు

కాన్ఫరెన్స్‌ లీడర్‌ షిప్‌ కమిటీలో రవి అచంట (చైర్మన్‌), ప్రవీణ్‌ మోతూరు (వైస్‌ చైర్మన్‌), ఫణి రామినేని (వైస్‌ చైర్మన్‌), మదన్‌ పాములపాటి (సెక్రటరీ), శ్రీనివాస్‌ బొప్పన (ట్రెజరర్‌), నేషనల్‌ కమిటీలో గంగాధర్‌ దేసు (ఫండ్‌ రైజింగ్‌), డా. చౌదరి అచంట (ప్రోగ్రామ్స్‌), కాన్ఫరెన్స్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యులుగా శ్రీనివాస్‌ మద్దాలి (బోర్డ్‌ చైర్మన్‌), మోహన్‌ కృష్ణ మన్నవ (ప్రెసిడెంట్‌), డా. అప్పారావు ముక్కామల (కాన్ఫరెన్స్‌ అడ్వయిజర్‌), డా. రవి ఆలపాటి (బోర్డ్‌ డైరెక్టర్‌), డా. మధు కొర్రపాటి (డైరెక్టర్‌), శ్రీనివాస్‌ కొడాలి (డైరెక్టర్‌), శ్రీనివాస్‌ కోనేరు (ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌), శ్రీనివాస్‌ గుత్తికొండ (బిఓడి వైస్‌ చైర్మన్‌), శ్రీధర్‌ అప్పసాని (బోర్డ్‌ సెక్రటరీ), అమర్‌ అన్నె (హాస్పిటాలిటీ) ఉన్నారు. నవీన్‌ అడుసుమిల్లి (అకౌంటింగ్‌), బాంక్వెట్‌ వ్యవహారాలను రాణి వెగె, వెంకట్‌ యలమంచి, సిఎంఇ, అలూమ్ని వ్యవహారాలను డా. పాల్‌ దేవరపల్లి, రాజా చెన్నుపాటి, ఫుడ్‌ విషయాలను ప్రసాద్‌ తాళ్ళూరు, మురళి కలగర, వేణు బొల్లినేని, నిరంజన్‌ వల్లభనేని, ప్రవీణ్‌ వేములపల్లి, ఫండ్‌ రైజింగ్‌ కమిటీలో మూర్తి కొప్పాక, రాజా చెన్నుపాటి ఉన్నారు. హాస్పిటాలిటీ డోనర్స్‌ అండ్‌ స్పాన్సర్స్‌ వ్యవహారాలను శ్రీనివాస్‌ పిడికిటి, అమర్‌ అన్నె, హాస్పిటాలిటి -గెస్ట్స్‌ శ్రీనివాస్‌ ఆచంట, నాలెడ్జ్‌ సెంటర్‌ వ్యవహారాలను ప్రవీణ్‌ భూమన, రమేష్‌ తుమ్ము, శ్రీధర్‌ తుమ్మల, ఆపరేషన్స్‌కు నాగేంద్ర వెగె, ప్రోగ్రామ్స్‌ కమిటీలో సుజన అచంట, సుబ్బారావు పుట్రేవు, పబ్లిసిటీ మార్కెటింగ్‌ వ్యవహారాలను అరవింద్‌ కోగంటి, వాసుబాబు అడ్డగడ్డ, రిజిస్ట్రేషన్‌ విషయాలను రమేష్‌ మర్యాల, శ్రీధర్‌ అట్లూరి, వెంకట్‌, రాహుల్‌ విరాటపు, రెవెన్యూ జనరేషన్‌ కమిటీలో శ్రీధర్‌, కృష్ణ రంగరాజన్‌, స్పోర్ట్స్‌ కమిటీలో రాజేష్‌, వెబ్‌ అండ్‌ సావనీర్‌ కమిటీలో విజయ్‌ వెనిగళ్ళ, యూత్‌ ప్రోగ్రామ్‌ వ్యవహారాలను డా సుధ పరిమి, డా. వేణు కృష్ణద్రుల చూస్తున్నారు.