మాపై ట్రంప్ ప్రభావం లేదు
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

మాపై ట్రంప్ ప్రభావం లేదు

17-06-2017

మాపై ట్రంప్ ప్రభావం లేదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ తమ వ్యాపారాలకు విఘాతం కల్గిస్తున్నారంటూ విప్రో సంస్థ బహిరంగంగా ప్రకటన చేస్తే, దీనికి భిన్నంగా దేశీయ అతిపెద్ద టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ ప్రకటన చేసింది. ట్రంప్‌ భయాందోళలను టీసీఎస్‌ కొట్టిపారేస్తోంది. ట్రంప్‌ భయంతో వీసాల విషయంలో దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ ఎగుమతిదారు ఎలాంటి మార్పులను చేపట్టలేదని, అమెరికా మార్కెట్‌తో సహా అన్ని మార్కెట్లలో కంపెనీ విజయవంతంగా వ్యాపారాలను కొనసాగిస్తుందని టీసీఎస్‌ చైర్మన్‌ ఎన్‌.చంధ్రశేఖరన్‌ తెలిపారు. ప్రతి మార్కెట్లో తాము రికట్‌మెంట్‌ చేపడుతున్నామని చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. వార్షిక సాధారణ సమావేశంలో ట్రంప్‌ భయాందోళనలనూ తగ్గిస్తూ టీసీఎస్‌ ఇన్వెష్టర్లకు భరోసా ఇచ్చారు. టీసీఎస్‌ కార్యకలాపాలు సాగించే ప్రతి దేశంలో స్థానిక చట్టాలకు కట్టబడి ఉంటుందని, ఆ దేశ మార్కెట్లలో టాప్‌ రికటర్‌ గా  తమ కంపెనీనే ఉన్నట్టు పేర్కొన్నారు.