ఐక్యరాజ్య సమితి జడ్జిగా భారత మహిళ
APEDB
Ramakrishna

ఐక్యరాజ్య సమితి జడ్జిగా భారత మహిళ

17-06-2017

ఐక్యరాజ్య సమితి జడ్జిగా భారత మహిళ

ఐక్యరాజ్య సమితిలో మరో భారతీయురాలికి ఉన్నత పదవి దక్కింది. సముద్ర జలాల వివాదాలను పరిష్కరించే ఇంటర్నేషనల్‌ ట్రిబ్యునల్‌ ఫర్‌ ది లా ఆఫ్‌ ది సీ(ఐటీఎల్‌ఓఎస్‌)కు భారత్‌కు చెందిన న్యాయ నిపుణురాలు నీరు చాధా ఎన్నికయ్యారు. ఈ ట్రిబ్యునల్‌కు జడ్జిగా నియమితులైన తొలి భారత మహిళ ఆమెనే కావడం విశేషం. చాధా ఈ  పదవిలో 9 ఏళ్లు ఉంటారు. ప్రముఖ లాయర్‌ అయిన చాధా విదేశాంగ శాఖలో ముఖ్య న్యాయ సలహాదారుగా పనిచేసిన తొలి మహిళగా పేరుగాంచారు.