మోదీ-ట్రంప్ చర్చలకు అది అడ్డురాదు
Nela Ticket
Kizen
APEDB

మోదీ-ట్రంప్ చర్చలకు అది అడ్డురాదు

17-06-2017

మోదీ-ట్రంప్ చర్చలకు అది అడ్డురాదు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి హెచ్‌-1బీ వీసాలపై ఆందోళనలు విపరీతంగా పెరిగాయి. హెచ్‌-1బీ వీసాల్లో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తూ భారత టెకీలకు, దేశీయ టెక్నాలజీ కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అయితే ట్రంప్‌ దేశాధ్యక్షుడిగా శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన తర్వాత తొలిసారి ఆయననకు కలువడానికి భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ నెలాఖరున అమెరికా వెళ్లబోతున్నారు. ఈ పర్యటలో భాగంగా ట్రంప్‌ -మోదీల మధ్య పలు అంశాలపై చర్చలు జరుగనున్నాయి. తొలిసారి నిర్వహించబోతున్న ఈ చర్చలకు హెచ్‌-1బీ వీసా విషయం ఎలాంటి సమస్య సృష్టించదని టాప్‌ అమెరికన్‌ బిజినెస్‌ అడ్వకసీ గ్రూప్‌ చెప్పింది.