Telangana Tourism
Karur Vysya Bank
Manjeera Monarch

మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాలు

18-06-2017

మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద మూడవ అంతర్జాతీయ యోగా  దినోత్సవాలు

మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ  మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎం.జి.ఎం.న్.టి మరియు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సంయుక్త నిర్వహణలో మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా- 1201 హిడెన్ రిడ్జ్ డ్రైవ్, ఇర్వింగ్, (డల్లాస్) టెక్సాస్ వద్ద జూన్ 25, 2017, ఆదివారం ఉదయం 7:30 -9: 30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

యోగా చేయడానికి కావలసిన యోగా మాట్స్ ను పరిమిత సంఖ్యలో ఏర్పాటు చేస్తామని, ఉచిత ప్రవేశం, ఉచిత అల్పాహార ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో  పాల్గొనే వారు ముందుగా వచ్చి నిర్ణేత పద్దతిలో తమ వాహనములను పార్క్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము.  ఈ కార్యక్ర మానికి టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులు మాట్ రినాల్డి  మరియు ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టోప్ఫర్ ప్రత్యేక అతిధులుగా హాజరవుతున్నారు.

ఈ యోగా ఉత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని యోగా మరియు ధ్యానంలో ఉన్న మెళకువలను నేర్చుకొని దైనందిన జీవితంలో క్రమం తప్పకుండా చేస్తూ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందింప చేసుకోవాలని డాక్టర్ తోటకూర కోరారు.

ఎం.జి.ఎం.న్.టి కార్యదర్శి రావు కల్వల, వైస్ ఛైర్మన్ సల్మాన్ ఫర్షోరి మరియు ఇతర బృంద సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

వివరాల కోసం, దయచేసి www.mgmnt.org సందర్శించండి లేదా ఎం.జి.ఎం.న్.టి  బోర్డు సభ్యులను సంప్రదించండి –

డాక్టర్ ప్రసాద్ తోటకుర - 817-300-4747, పియుష్ పటేల్ - 214-850-9828, రావు కల్వల -732-309-0621, సల్మాన్ ఫర్షోరి - 469-585-2104, తయాబ్ కుందవాలా - 469 -733-0859, శ్రీమతి షబ్నం మోడ్గిల్-214-675-1754, జాన్ హామండ్  - 972-904-5904,  కమల్ కౌషల్ - 972-795-2328 , లాల్ దస్వాని – 214-566-3111