అమెరికా పాఠ్యాంశాల్లో సిక్కుల చరిత్ర?
Nela Ticket
Kizen
APEDB

అమెరికా పాఠ్యాంశాల్లో సిక్కుల చరిత్ర?

19-06-2017

అమెరికా పాఠ్యాంశాల్లో సిక్కుల చరిత్ర?

అమెరికా పాఠ్యాంశాల్లో సిక్కుల చరిత్రను చేర్చడానికి కృషి చేస్తానని ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ హామీ ఇచ్చారు. ఆయనను ఇండియానా పోలిస్‌లో సిక్కు రాజకీయ కార్యచరణ సంఘం (సిక్స్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ-సిక్స్‌పాక్‌) సభ్యులు కలిసి వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అమెరికాకు సిక్కు సామాజిక వర్గం అందిస్తున్న సేవలను పెన్స్‌ ప్రశంసించారు. సిక్కులు సైన్యంతోపాటు వివిధస్థాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తూ సేవలు చేస్తున్నారని చెప్పారు. సిక్కులను తాను అభిమానిస్తానని, తాను గవర్నర్‌గా ఉన్నప్పటి నుంచి వారి సమస్యలపై దృష్టి పెడుతున్నానని అన్నారు.