అమెరికా అటార్నీ జనరల్స్ పై ట్రంప్ సంచలన నిర్ణయం
APEDB
Ramakrishna

అమెరికా అటార్నీ జనరల్స్ పై ట్రంప్ సంచలన నిర్ణయం

11-03-2017

అమెరికా అటార్నీ జనరల్స్ పై ట్రంప్ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒబామా ప్రభుత్వం సమయంలో నియామకం అయిఇప్పటికీ ఫెడరల్ కోర్టుల్లో చీఫ్ ప్రాసిక్యూటర్లుగా విధులు నిర్వహిస్తున్న 46 మంది యూఎస్ అటార్నీల నుంచి ఒకేసారిరాజీనామా కోరుతూ నిర్ణయం తీసుకున్నారు. ఒబామా హయాంలో నియామకం అయిన వీరి నుంచి రాజీనామా కోరినట్లుఅమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెసన్స్ అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేర్చేందుకుఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తోంటే.. వాటికి కోర్టులు మాత్రం అడ్డుకట్ట వేస్తున్నాయి. ట్రంప్ విధానాలను,తీసుకున్న నిర్ణయాల పట్ల కోర్టుల్లో న్యాయవాదుల ముందు సరిగా వాదించడం లేదన్న అభిప్రాయంతోనే వారిని మార్చాలనేనిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.