తానా ఎన్నికల సందడి...పోటీలు...ఏకగ్రీవాలు

తానా ఎన్నికల సందడి...పోటీలు...ఏకగ్రీవాలు

11-03-2017

తానా ఎన్నికల సందడి...పోటీలు...ఏకగ్రీవాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఎన్నికలను చూస్తుంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలంత సందడి కనిపిస్తోంది. పోటాపోటీ ప్రచారాలు, వివిధ నగరాల్లో పర్యటనలు, సామాజికమాధ్యమాల ద్వారా పోస్టులపై పోస్టులతో తానా ఎన్నికలు ఊపందుకున్నాయి. ఈసారి తానా ఎన్నికల్లో కొన్ని కీలక పదవులకు పోటీ జరుగుతోంది. కొన్ని పదవులకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కొన్ని పదవులకు పోటీ తీవ్రం

తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ పదవికి జే తాళ్ళూరితోపాటు శ్రీనివాస గోగినేని కూడా పోటీ పడుతున్నారు. డైరెక్టర్‌ - నాన్‌ డోనర్‌ పోస్టులకోసం నాగేంద్ర శ్రీనివాస్‌ కొడాలి, జగదీష్‌ ప్రబల, వెంకట రమణ యార్లగడ్డ, సెక్రటరీ పదవికోసం భక్త బల్లా, అంజయ్య చౌదరి లావు, అప్పలచియాన్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ పదవికోసం కుమార్‌ ఎ నెప్పాలి, మల్లిఖార్జున వేమన, న్యూఇంగ్లాండ్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ పదవికోసం విశ్వనాథ్‌ నాయునిపాటి, శ్రీనివాస్‌ ఎండూరి, రీజినల్‌ కో ఆర్డినేటర్‌ సౌత్‌ ఈస్ట్‌ పదవికోసం కిరణ్‌ గోగినేని, భరత్‌ మద్దినేని పోటీ పడుతున్నారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు...

తానా ఫౌండేషన్‌ ట్రస్టీ డోనర్‌ పదవులకు శ్రీనివాసరావు మండవ, శశికాంత్‌ వల్లిపల్లి ఎన్నికయ్యారు. డైరెక్టర్‌ (డోనర్‌) పదవికి హరీష్‌ కోయ, తానా ఫౌండేషన్‌ ట్రస్టీ నాన్‌ డోనర్‌ పదవులకు హేమచంద్ర శేఖర్‌ కానూరు, రవి మందలపు, నిరంజన్‌ శృంగవరపు, శివరామ్‌ యార్లగడ్డ ఎన్నికయ్యారు.

తానా ట్రెజరర్‌గా రవి పొట్లూరి, జాయింట్‌ సెక్రటరీగా శ్రీకాంత్‌ దొడ్డపనేని, జాయింట్‌ ట్రెజరర్‌గా అశోక్‌బాబు కొల్లా, కమ్యూనిటీ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌గా సతీష్‌ వేమూరి, కల్చరల్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌గా రాజేష్‌ అడుసుమిల్లి, కౌన్సిలర్‌ ఎట్‌ లార్జ్‌ పదవికి వినోజ్‌ చనుమోలు, ఉమెన్స్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌గా లక్ష్మీ దేవినేని, కెనడా రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా లక్ష్మీనారాయణ సూరపనేని, రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా కేపిటల్‌కు రఘుదీప్‌ మేక, రీజినల్‌ కో ఆర్డినేటర్‌ (మిడ్‌ అట్లాంటిక్‌) పదవికి నాగరాజు నలజుల, రీజినల్‌ కో ఆర్డినేటర్‌ (మిడ్‌వెస్ట్‌) హరీష్‌ కొలసాని, రీజినల్‌ కో ఆర్డినేటర్‌ (న్యూయార్క్‌) విద్యాగారపాటి, రీజినల్‌ కో ఆర్డినేటర్‌ (నార్త్‌) పదవికి సునీల్‌ పాంత్రా, రీజినల్‌ కో ఆర్డినేటర్‌ నార్త్‌ సెంట్రల్‌ రాజేంద్ర ప్రసాద్‌ లోసెట్టి, రీజినల్‌ కో ఆర్డినేటర్‌ (నార్త్‌వెస్ట్‌) చంద్రిక నిమ్మగడ్డ, రీజినల్‌ కో ఆర్డినేటర్‌ (ఒహాయో వ్యాలీ) శ్రీనివాస్‌ సంగ, రీజినల్‌ కో ఆర్డినేటర్‌ (రాకీ మౌంటెన్స్‌) పదవికి విజయ్‌ కొమ్మినేని, రీజినల్‌ కో ఆర్డినేటర్‌ (సౌత్‌ సెంట్రల్‌) పదవికి శేషుబాబు ఇంటూరి, రీజినల్‌ కో ఆర్డినేటర్‌ (సౌత్‌ వెస్ట్‌) పదవికి సుగన్‌ చాగర్లమూడి, రీజినల్‌ కో ఆర్డినేటర్‌ (వెస్ట్‌) పదవికి మధు రావెళ్ళ ఎన్నికైనట్లు తానా ఎన్నికల కమిటీ చైర్మన్‌ సతీష్‌ చిలుకూరి తెలిపారు.