ఆ దంపతులు ఓ అద్భుతం!
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

ఆ దంపతులు ఓ అద్భుతం!

14-07-2017

ఆ దంపతులు ఓ అద్భుతం!

వారిద్దరూ మానసిక వైద్యులు. మన తెలుగు దంపతులు. తమ వద్దకు వచ్చే రోగుల అంతరంగాన్ని చదివి, వారి చింతని దిగులుని ఇట్టే కనిపెట్టే గొప్ప వైద్య నిపుణులుగా వారికి అమెరికాలో మంచిపేరు ఉంది. అయితే వారి మనో ప్రపంచాలు వేరు. కమ్మని వంట, పసందైన సంగీతం సీతా గీత(61) అభిరుచి. హృద్యమైన ఛాయాచిత్రం, ప్రకృతి రహస్యాల అన్వేషణ ఉమామహేశ్వర (63) హాబీ. అంతేకాదు చెయ్యితిరిగిన ఫొటోగ్రాఫర్‌గా అమెరికా ప్రభుత్వం ఆయనని గుర్తించింది. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఉమామహేశ్వరని వరించాయి. కల్పతరు దంపతులుగా ఇండియానా రాష్ట్రం లోని లోగన్‌స్పోర్ట్‌ ప్రాంతంలో ప్రసిద్ధులైన వీరిది కృష్ణా జిల్లా మచిలీపట్నం. గత వారం సొంత విమానంలో (ద పైపర్‌ ఆర్చర్‌ పీఏ 28) విహారానికి వెళ్లి, మరి తిరిగి రాలేదు. హూస్టన్‌లో వారి విమానం కూలి, ఇద్దరూ మరణించారు. ఈ సమయంలో విమానాన్ని ఉమామహేశ్వర నడుపుతున్నారు.