అంధుల కోసం కొత్త యాప్‌
Sailaja Reddy Alluddu

అంధుల కోసం కొత్త యాప్‌

14-07-2017

అంధుల కోసం కొత్త యాప్‌

అంధులు, దృష్టి లోపం ఉన్నవారి కోసం టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కొత్త ఐఫోన్‌ యాప్‌ను విడుదల చేసింది. కృత్రిమ మేధతో పనిచేసే ఈ యాప్‌ సాయంతో, సరికొత్త ప్రపంచాన్ని వీరు చూస్తారని కంపెనీ తెలిపింది. సీయింగ్‌ ఏఐ పేరుతో విడుదల చేసిన ఈ యాప్‌ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. దీంతో టెక్ట్స్‌ చదవడం, వ్యక్తుల గురించి వివరించడం, ఉత్పత్తులను గుర్తించడం, కరెన్సీ మారకం, వ్యక్తి పరిసరాల గురించి వెల్లడించడం వంటి చేయొచ్చని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌ కెమేరా లేదా కెమేరా కలిగిన స్మార్ట్‌ గ్లాసెస్‌ ఉపయోగించి పరిసరాల్లోని వ్యక్తులు, వస్తువులను ఈ యాప్‌ గుర్తించగలదు. క్లౌడ్‌, కృత్రిమ మేధతో పనిచేసే ఈ యాప్‌ను మైక్రోసాఫ్ట్‌ పరిశోధన ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందించిందని కంపెనీ తెలిపింది. ఐఫోన్‌ కెమేరాపై ఆధారపడే ఈ యాప్‌ మైక్రోసాఫ్ట్‌ మెషీన్‌ లెర్నింగ్‌, ఇమేజ్‌ గుర్తింపు ఆల్గారిథమ్స్‌లతో సాయంతో పనిచేస్తుంది.