హోమ్‌3డీని తయారు చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
Nela Ticket
Kizen
APEDB

హోమ్‌3డీని తయారు చేసిన అమెరికా శాస్త్రవేత్తలు

14-07-2017

హోమ్‌3డీని తయారు చేసిన అమెరికా శాస్త్రవేత్తలు

ప్రత్యేకంగా రూపొందించిన కళ్లజోళ్లు లేకుండానే 3డీ సినిమాలు చూసే కొత్త విధానాన్ని అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని హోమ్‌3డీగా వ్యవహరిస్తున్నారు. దీనిసాయంతో 3డీ సినిమా స్టీరి యోస్కోపీ నమూనా నుంచి సాధారణ టీవీలో సైతం కళ్లజోడు లేకుండా చూడటానికి ఉపకరించే ఆటో మల్టీ స్కోపిక్‌ డిస్‌ప్లేలోకి మారుతుంది. ఇందులో బొమ్మలు మాత్రమే కనిపిస్తాయి, శబ్దాలు వినిపించవని ఎంఐటీకి చెందిన పీటర్‌ కెల్‌హోఫెర్‌ తెలిపారు. శబ్దాలు కూడా వినిపించాలంటే గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌(జీపీయూ) ఉండాలంటున్నారు. ఉదాహరణకు ఎక్స్‌బాక్స్‌ లేదా ప్లేస్టేషన్‌ ఉండాలి. భవిష్యత్తులో టీవీ, మీడియా ప్లేయర్స్‌లో చిప్‌ రూపంలో హోమ్‌3డీ పనిచేసే అవకాశం ఉంది.