గ్రీన్‌కార్డు నిబంధనలపై భిన్నాభిప్రాయాలు
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

గ్రీన్‌కార్డు నిబంధనలపై భిన్నాభిప్రాయాలు

14-07-2017

గ్రీన్‌కార్డు నిబంధనలపై భిన్నాభిప్రాయాలు

అమెరికాలో నివసించేందుకు జారీ చేసే గ్రీన్‌ కార్డ్‌ విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిబంధనలను మార్చాలని చాలామంది కోరుకుంటున్నారు. భారతీయులకు గ్రీన్‌కార్డు జారీచేసే విషయంలో అమెరికా విధించిన నిబంధనలు ఎంతమాత్రం సమంజసం కాదని అమెరికా రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ ఉద్యోగ నిపుణులు వారు ఆశించే గ్రీన్‌కార్డు పొందాలంటే 12 ఏళ్లు వేచి చూడాల్సిందేనని ఇటీవల వెలువడైన నివేదికలో తేలింది. కెన్సాస్‌ రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ నేత కెవిన్‌ యోదర్‌ దీనిపై స్పందించారు. భారత్‌ లాంటి పెద్ద దేశాలకు ఈ నిబంధనలు వర్తింపజేయడం సరికాదన్నారు.

గ్రీన్‌లాండ్‌ లాంటి చిన్న దేశాల నుంచి వచ్చిన వారితో సమానంగా అత్యధిక జనాభా ఉన్న భారత్‌, చైనా దేశాల నుంచి అమెరికా వచ్చిన వారికి గ్రీన్‌కార్డు మంజూరు చేయడం అన్యాయంగా ఉందని యోదర్‌ అభిప్రాయపడ్డారు. ఉద్యోగం ఆధారంగా అమెరికాకు వచ్చి గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 95 శాతానికి పైగ ఆభ్యర్థులు ప్రస్తుతం తాత్కాలిక వీసాపై నివసిస్తున్నారు.