సియాటిల్ లో నాట్స్ "సంధ్యా రాగం"
MarinaSkies
Kizen
APEDB

సియాటిల్ లో నాట్స్ "సంధ్యా రాగం"

14-07-2017

సియాటిల్ లో నాట్స్

అమెరికాలో ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ మన సంస్క్ర‌తి సంప్రదాయాలను చాటి చెప్పేందుకు నాట్స్ (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఎన్నో కార్యక్రమాలతో మీ ముందుకొస్తోంది. ఇందులో భాగంగా .....

సంగీత ప్రియుల కోసం పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ  "సంధ్యా రాగం" పేరిట సరదా సాయంత్రాన్ని మరింత ఆహ్లదపరచడానికి జూలై 15 న కెన్ హాల్, సియాటిల్ లో టాలీవుడ్ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ ,ప్రముఖ గాయనీ గాయకులు  సునిత, యాజిన్ నజిర్, భార్గవి పిల్లై, దినకర్, సమీర లు వారి గానామృతంతో ఉర్రూతలూగించబోతున్నారు.

పీపుల్ మీడియా ఫాక్టరీ భాగస్వామిగా  వ్యవహరిస్తున్న  ఈ ఫ్రీ మెగా ఈవెంట్ లో... అంకిత ప్ర‌ధాన పాత్ర పోషించి

ప్రముఖ దర్శకులు వీ ఎన్ ఆదిత్య దర్శకత్వంలో ... పూర్తిగా   అమెరికాలో చిత్రీకరించిన"  ఫోర్స్డ్  ఆర్ఫన్స్ " అనే క్రాస్ఓవర్  సినిమా  టీజర్  రిలీజ్ కూడా ఉండబోతోంది.  

ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఉచితంగా ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తొంది నాట్స్. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం...ఈ మెగా ఈవెంట్ లో పాల్గొనండి..గ్రాండ్ స‌క్స‌స్ చేయండి.  మ‌రిన్ని వివరాలకోసం సంప్రదించవలసిన నంబర్ -

చైతన్య (యు.ఎస్ + 1830202 4699)