సరైన సమయంలో పుతిన్‌ను ఆహ్వానిస్తా: ట్రంప్‌
Telangana Tourism
Vasavi Group
Manjeera Monarch

సరైన సమయంలో పుతిన్‌ను ఆహ్వానిస్తా: ట్రంప్‌

15-07-2017

సరైన సమయంలో పుతిన్‌ను ఆహ్వానిస్తా: ట్రంప్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను సరైన సమయంలో వైట్‌హౌస్‌కు ఆహ్వానిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఫ్రాన్స్‌ నుంచి అమెరికాకు తిరుగుప్రయాణంలో భాగంగా ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ఆయన మాట్లాడుతూ పుతిన్‌ను ఆహ్వానించేందుకు ఇది సరైన సమయం కాదని చెప్పారు. రష్యాను ప్రపంచంలో శక్తివంతమైన రెండో అణ్యాయుధ దేశంగా అభివర్ణించిన ట్రంప్‌ అలాంటి దేశంతో చర్చలు వద్దనడం మూర్ఘత్వమని అభిప్రాయపడ్డారు. పుతిన్‌ను ఆహ్వానించనని చెప్పడం తనకు చాలా సులువని, అయితే అలాంటి తెలివితక్కువ పని చేయబోనన్నారు.