అమరనాథ్ యాత్రికుల పై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ప్రతేక శాంతి పూజల సమావేశం
Nela Ticket
Kizen
APEDB

అమరనాథ్ యాత్రికుల పై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ప్రతేక శాంతి పూజల సమావేశం

17-07-2017

అమరనాథ్ యాత్రికుల పై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ప్రతేక శాంతి పూజల సమావేశం

న్యూజెర్సీ ఎడిసన్ లో గల శ్రీ సాయి దత్త పీఠం లో  "అమరనాథ్ యాత్రికుల" పై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ, అలాగే దాడిలో చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం ప్రతేక శాంతి పూజల సమావేశం చేయడం జరిగింది. 

ముందుగా ఉగ్రవాద దాడిలో చనిపోయిన అమరనాథ్ యాత్రికుల కోసం, ప్రత్యేక శాంతి పూజలు చేయడం జరిగింది. ఈ శాంతి పూజలో పండితులు వేదిక్ శాంతి మంత్రాలతో శాంతి పూజ నిర్వహించారు. 

ఆ తరువాత, చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాల మౌనం పాటించడం జరిగింది. ఆ తరువాత, ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలు రాబోయే కాలంలో ఇలాంటి ఘటనలు జరుగుగాకుండా ఉండేందుకు తీసుకోల్సిన జాగ్రతలు, ఒకవేళా జరిగితే తీసుకోల్సిన చర్యల గురించి వివరించారు. 

ముఖ్యముగా నేతలందరూ, హిందువుల ఐక్యత గురించి చర్చించారు. ఇలాంటి విషయాలలో హిందువులంతా, రాజకీయాలకు, జెండా -అజెండాలకు అతీతంగా ఒక్కటై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ఐక్యత కోసం ప్రవాస భారతీయులందరు ముందు ఉంటారని వారు తెలిపారు. అదేవిదంగా, దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రవాస భారతీయులు అండగా ఉంటారని తెలిపారు. 

హిందూ స్వయం సేవక్ సంఘ్ నేతలు శ్రీ  నిమేష్ దీక్షిత్ , గణేష్ రామకృష్ణన్  మాట్లాడుతూ హిందూ మిత్రులు ఏకతాటి ఫై నిలబడి సంగీభావం తెలపాలి అన్నారు.

శ్రీ సత్య దోసపాటి గారు, హిందూ #HINDULIVESMATTER కార్యకర్త , మాట్లాడుతూ, " ఇది ఒక ఇస్లామిక్ ఉగ్రవాద చర్య , ఇలాంటి ఇస్లామిక్ ఉగ్రవాద ఘటనలు అనేక మంది, సామాన్య జనాలతో పటు, అనేక సైనికుల ప్రాణాలు బలిగొన్నాయి " అని తెలిపారు.

ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బిజేపీ అధ్యక్షులు, శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు మాట్లాడుతూ "ఈ ఉగ్రవాద చర్యలను, మనం మన స్థానిక రాజకీయ నేతలకు వివరించాల్సిన అవసరం ఉంది, అలాగే ఈ ఉగ్రవాదనికి మూలమైన  పాకిస్తాన్ ను  ఏకాకిగా చేయాలి " అని పిలుపునిచ్చారు.

గ్లోబల్ ఇండియా ఫర్ భారత్ వికాస్ ప్రెసిడెంట్ శ్రీ గౌరంగ్ వైష్ణవ్ గారు, శ్రీ స్వామి వివేకానంద గారి చెప్పిన నీతి వాక్యాలను చెప్పి"ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకోండి, దాన్నే జీవిత లక్ష్యం చేసుకొని పోరాడండి, " ఈ వాక్యాలను మనం ఇప్పుడు ఉగ్రవాద పోరాటంలో  పాటించాలి అని తెలిపారు. 

సాయి దత్త పీఠం వ్యవస్థాపకులు రఘు శర్మ గారు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని, ప్రవాస భారతీయులందరు కలిసి ఒక తాటి మీదకు రావాలని కోరారు.

ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన విలాసరెడ్డి జంబుల గారిని, గణేష్ గారిని, మీడియా ఇంచార్జి దిగంబర్ గారికి, సాయి దత్త పీఠం బోర్డు మెంబర్లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

ఈ కార్యక్రమానికి శ్రీ  రఘుశర్మ శంకరమంచి,  ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బిజేపీ  అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల, హిందూ స్వయం సేవక్ సంఘ్ నేతలు శ్రీ  నిమేష్ దీక్షిత్,  శ్రీ సత్య దోసపాటి, శ్రీ  గౌరంగ్ వైష్ణవ్, శ్రీ గణేష్ రామకృష్ణన్, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బిజేపీ  యూత్ కో- కన్వీనర్ శ్రీ విలాస్ రెడ్డి జంబుల, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బిజేపీ మీడియా -కో కన్వీనర్, శ్రీ దిగంబర్ ఇస్లాంపురే,  ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బిజేపీ న్యూజెర్సీ యూత్ కన్వీనర్ శ్రీ పార్తీబన్ వర్ధన్, గోపి, నగేష్, మురళి, లక్ష్మి, పవన్, అచ్చుతరెడ్డి, దాము గేదల గార్లతో పాటు  అనేక  మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.