ట్విన్స్ బర్గ్ లో ఘనంగా ట్విన్స్ డేస్ ఫెస్టివల్
MarinaSkies
Kizen

ట్విన్స్ బర్గ్ లో ఘనంగా ట్విన్స్ డేస్ ఫెస్టివల్

08-08-2017

ట్విన్స్ బర్గ్ లో ఘనంగా ట్విన్స్ డేస్ ఫెస్టివల్

అమెరికాలోని ఒహైయో ట్విన్స్‌బర్గ్‌ ప్రాంతంలో కవల కమ్యూనిటీ ప్రతీ ఏటా ఆగస్టు మొదటివారంలో ట్విన్స్‌డేస్‌ ఫెస్టివల్‌ పేరుతో ఓ వేడుక నిర్వహిస్తుంటుంది. ఇందులో కేవలం ఒకే రూపంతో ఉన్న కవలలు మాత్రమే పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది కవలలు ఈ వేడుకలో పాల్గొనడానికి వస్తుంటారు. మూడు రోజులపాటు వీరంతా కలిసి ఆటపాటలతో ఆనందంలో మునిగితేలుతారు. ఒకరినొకరు పరిచయం చేసుకొని, స్నేహితులవుతారు. వీరి కోసం నిర్వాహకులు పలు కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తారు. అయితే ఈ వేడుకల్లో కవలలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ఇందుకోసం ముందుగానే తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. సాధారణ వ్యక్తులకు ప్రవేశం ఉండదు. ఈ వేడకలు కొన్నేళ్లుగా జరుపుకుంటున్నారు. తాజాగా ఆగస్టు 4 నుంచి 6 వరకు ఈ వేడులకు ట్విన్స్‌బర్గ్‌లో ఘనంగా జరిగాయి. ఈ ఏడాది 1905 మంది కవలలు ఈ వేడుకలో పాల్గొన్నారట.