హార్వార్డ్ వర్సిటీలో రిజర్వేషన్ గొడవ
MarinaSkies
Kizen

హార్వార్డ్ వర్సిటీలో రిజర్వేషన్ గొడవ

08-08-2017

హార్వార్డ్ వర్సిటీలో రిజర్వేషన్ గొడవ

అమెరికాలో కూడా రిజర్వేషన్ల గొడవ తారాస్థాయికి చేరుకుంటోంది. హార్వార్డ్‌ యూనివర్సిటీ తాజా అడ్మిషన్లలో శ్వేతజాతేతరులకు సగానికి పైగా సీట్లు కేటాయించడంతో అమెరికా విశ్వవిద్యాలయాల్లో కోటాలపై పెద్ద దుమారం మొదలైంది. మరోపక్క వర్సీటీల సీట్ల కేటాయింపులో భారతీయులు సహా ఆసియా అమెరికన్లకు అన్యాయం జరుగుతుందంటూ రెండేళ్ల క్రితం దాఖలైన ఫిర్యాదులపై దర్యాప్తునకు ఆదేశించామని ఫెడరల్‌ సర్కారు ప్రకటించడం ట్రంప్‌ సర్కారుకు, మైనార్టిలకు మధ్య ఘర్షణకు తెర లేపినట్టయింది. ఇండియాలో మాదిరిగా బలహీనవర్గాలకు రాజ్యాంగ లేదా చట్టబద్ధ రిజర్వేషన్లు అమెరికా విద్యాసంస్థల్లో , ఉద్యోగాల్లో లేవు. కాని జనాభాలో 12.2 శాతం ఉన్న నల్లజాతివారు (ఆఫ్రికన్‌ అమెరికన్లు), 16.3 శాతమున్న స్పానిస్‌ భాష మాట్లాడే లాటినో లేదా హిస్పానిక్‌ జాతులవారు (దక్షిణ, మధ్య అమెరికా దేశాల నుంచి వచ్చిన జనం) శ్వేతజాతి అమెరికన్ల కన్నా భాగా వెనుకబడి ఉన్న కారణంగా వారికి కేవలం ప్రతిభే ప్రాతిపదికగా చూస్తే న్యాయం జరగదు అన్న ఉద్దేశ్యంతో రాజ్యాంగ స్ఫూర్తితో కొన్ని ప్రత్యేక కేటాయింపుల ద్వారా సామాజిక న్యాయం అందేలా అమెరికా తగినన్ని విధానాలు రూపొందించింది. విద్యాసంస్థల్లో, ఆపీసుల్లో, ఫ్యాక్టరీలు వంటి కార్యక్షేత్రాల్లో అన్ని జాతులు లేదా రంగుల జనం కనిపించాలనేది అమెరికా సామాజిక న్యాయానికి మూల సూత్రం. రిజర్వేషన్‌ అనే పదానికి బదులు అఫర్మే టివ్‌ యాక్షన్‌ (నిశ్చయాత్మక చర్య), పాజిటివ్‌ డిస్క్రిమినేషన్‌ (సానుకూల వివక్ష) అనే పేర్లతో కొన్ని సీట్లను మైనారీలతో నింపుతున్నారు. కొద్దిగా మార్కులు తగ్గినాగాని ఈ వర్గాలకు సీట్లు కేటాయించడం దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది.

తాజాగా హార్వార్డ్‌ తాజా అడ్మిషన్ల వివరాలు (2021లో చదువు పూర్తయే బ్యాచ్‌) తెల్లజాతివారిలో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. మొత్తం 2056 మంది విద్యార్థులకు ప్రవేశం లభించగా, వారిలో 50.8 శాతం శ్వేతాజతేతరులు కావడం విశేషం. కిందటేడాది ఈ సంఖ్య 47.3 శాతమేగాని, ఇప్పుడు అది  సగానికి మించడం తెల్లజాతివారిఇక గుబులు పుట్టించే అంశంగా మారింది. ఈ అడ్మిషన్లలో ఆఫ్రికన్‌ అమెరికన్లకు 22.2 ఆసియాన& అమెరికన్లకు 14.6 లాటినోలకు 11.6 శాతం సీట్లు దక్కాయి. అమెరికా జనాభాలో ఐదు శాతం కూడా లేని ఆసియా అమెరికన్లకు హార్వార్డో దాదాపు 15 శాతం సీట్లు వచ్చాయి. దీంతో తెల్లజాతీయుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. మరోవైపు ట్రంప్‌ సర్కార్‌ కూడా మైనారిటీలపై కొంత కోపంతో ఉంది. తమను గెలిపించింది శ్వేతజాతీయులే కాబట్టి వారి ప్రయోజనాలకు భంగం కలగరాదని భావిస్తోంది. అందుకే ఇప్పుడు ఎప్పుడో అందిన మైనారిటీల కోటాపై ఇప్పుడు విచారణకు ఆదేశించింది.