హెచ్1బి నిబంధనలు అమెరికాకే నష్టం
MarinaSkies
Kizen

హెచ్1బి నిబంధనలు అమెరికాకే నష్టం

09-08-2017

హెచ్1బి నిబంధనలు అమెరికాకే నష్టం

 హెచ్1బి వీసాల నిబంధనల్లో మార్పులు అమెరికా ఐటి రంగంపై ప్రతికూలంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు విశే్లషిస్తున్నారు. మూడేళ్ల తాత్కాలిక వర్క్ పర్మిట్‌కు అనుమతించే హెచ్1బి వీసాలకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తరువాత నిబంధనలు కఠినతరం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నిర్ణయంవల్ల భారత్ వంటి దేశాల నుంచి నైపుణ్యం ఉన్న ఐటి ఉద్యోగుల రాకకు తీవ్ర అవరోధం ఏర్పడుతుందని అమెరికా అత్యున్నత అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఐటి రంగానికి సంబంధించి సరైన వ్యక్తులకు ఆహ్వానం పలకటం, అవకాశం ఇవ్వటం రెండు దేశాల ఐటి రంగాలకు చాలా మంచిది. వారివల్లనే రెండు దేశాల ఐటి రంగాలు, నూతన ఆవిష్కరణలు, అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ తన నివేదికలో స్పష్టం చేసింది. కొత్త హెచ్1బి నిబంధనల వల్ల భారత్, అమెరికాల ఐటి కార్యక్రమంపై ప్రభావం పడుతుందని పేర్కొంది. ‘హెచ్1బి వీసా కార్యక్రమం వల్ల రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు లబ్ధి పొందిన మాట వాస్తవం. ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయటంవల్ల భారత్‌నుంచి వచ్చే నైపుణ్యం రాకుండా పోతుంది. ఐటి ఉత్పత్తి రంగంలో అమెరికా వెనుకబడుతుంది’ అని సిజిడి ఫెలో అయిన గౌరవ్ ఖన్నా అన్నారు. భారత్‌నుంచి మేథోవలసలు తగ్గటంవల్ల ఆ దేశం లాభపడుతుందని పరిశోధనలు చెప్తున్నాయన్నారు.