యూఎస్ మార్కెట్ లోకి టైటాన్
MarinaSkies
Kizen

యూఎస్ మార్కెట్ లోకి టైటాన్

09-08-2017

యూఎస్ మార్కెట్ లోకి టైటాన్

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తాజాగా ఇండియన్‌ లైఫ్‌ స్టయిల్‌ బ్రాండ్‌ టైటాన్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా టైటాన్‌ బ్రాండ్‌ 30కి పైగా దేశాల్లో ప్రాచుర్యం పొందనుంది. అలాగే అమెజాన్‌ సాయంతో యుఎస్‌  మార్కెట్‌లోకి కాలుమోపడం ద్వారా అక్కడి  వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అమెజాన్‌కు యుఎస్‌లో విస్తృతమైన మార్కెట్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఈ భాగస్వామ్యం టైటాన్‌కు వ్యాపార విస్తరణకు దోహదపడనుంది. ఈ సందర్భంగా టైటాన్‌ కంపెనీ లిమిటెడ్‌ సిఇఓ రవికాంత్‌ మాట్లాడుతూ ప్రతీ మూడు సెకెన్లకు ఒక టైటాన్‌ ఉత్పత్తి విక్రయమవుతోంది. ఈ నేపథ్యంలో యుఎస్‌లో కాలు మోపడం ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నామన్నారు.