ఇందిరాగాంధీ హత్యకు రెండేళ్లముందే!
MarinaSkies
Kizen

ఇందిరాగాంధీ హత్యకు రెండేళ్లముందే!

10-08-2017

ఇందిరాగాంధీ హత్యకు రెండేళ్లముందే!

టెక్నాలజీ పరంగా మన దేశ స్థితిగతులను మార్చిన దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీని ఓ అసమర్ధుడిగా అమెరికా నిఘా సంస్థ సీఐఏ గతంలో అభిప్రాయపడింది. ఇందిరా గాంధీ హత్యకు సుమారు రెండేళ్ల ముందు ఇచ్చిన నివేదికలో ఒకవేళ ఇందిర హఠాన్మరణానికి గురైతే కాంగ్రెస్‌ పార్టీని నడిపించగల రాజకీయ సమర్థత రాజీవ్‌లో లేదని సీఐఏ పేర్కొంది. అదే జరిగితే కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడడం ఖాయమని అభిప్రాయపడింది. అయితే, ఊహించని విధంగా 1984లో అక్టోబర్‌లో ఇందిర దారుణ హత్యకు గురి కావడం, అమె వారసత్వాన్ని రాజీవ్‌ కొనసాగించడం జరిగింది. మన దగ్గర సమాచార హక్కు లాగే అమెరికాలో ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఇన్షర్మేషన్‌ యాక్ట్‌ ఉంది. ఈ సదుపాయం ద్వారా సేకరించిన ఇండియా ఇన్‌ ది మిడ్‌ 1980స్‌ గోల్స్‌ అండ్‌ చాలెంజెస్‌ అనే డాక్యుమెంట్‌లో ఈ విషయం వెల్లడైంది.