బరితెగిస్తే భరతమే ... ట్రంప్‌
MarinaSkies
Kizen

బరితెగిస్తే భరతమే ... ట్రంప్‌

10-08-2017

బరితెగిస్తే భరతమే ... ట్రంప్‌

ఉత్తర కొరియా హెచ్చరికలపై అమెరికా నిప్పులు చెరిగింది. అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరాలపై దాడులు చేస్తామంటూ ఉత్తర కొరియా హెచ్చరించిన నేపథ్యంలో ఏకంగా దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రంగంలోకి దిగారు. అదే జరిగితే తమ ప్రతిస్పందన అత్యంత భీకరంగా ఉంటుందని తీవ్ర పదజాలంలో హెచ్చరించారు. ఇక ఎంత మాత్రం అమెరికాకు హెచ్చరికలు చేయడం ఉత్తర కొరియా మానుకోవడం మంచిదని, మళ్లీ ఇలాంటివి జరిగితే ఇంతవరకూ ప్రపంచం చూడని రీతిలో ఉత్తర కొరియాకు బుద్ధి చెబుతామని ట్రంప్‌ హెచ్చరించారు. మామూలు మాటలకంటే కూడా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నారు. అది ఎంతమాత్రం మంచిది కాదు అంటూ ట్రంప్‌ హెచ్చరించారు.