ప్రధాని సంబంధాలపై అమెరికా ప్రకటన
MarinaSkies
Kizen

ప్రధాని సంబంధాలపై అమెరికా ప్రకటన

11-08-2017

ప్రధాని సంబంధాలపై అమెరికా ప్రకటన

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సంబంధాలపై అమెరికా ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన చేసింది. విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి హెయిథర్‌ నౌర్ట్‌ మీడియాతో మాట్లాడుతూ, మోదీలో చాలా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. జూన్‌లో మోదీ పర్యటనను తనకు దక్కిన గౌరవంగా అమెరికా భావించిందని హెయిథర్‌ గుర్తు చేశారు. ఆ సందర్భంలోనే అమెరికా అధ్యక్షుడి తనయ ఇవాంకాను మోదీ ఇండియాకు ఆహ్వానించడం, హైదరాబాద్‌ వేదికగా జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఈఎస్‌)కు ఇవాంకా వస్తున్న నేపథ్యంలో హెయిథర్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యం లభించింది. హైదరాబాద్‌ వేదికగా నవంబర్‌ 28 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ జీఈఎస్‌ సదస్సులో పాల్గొనే అమెరికా బృందానికి ఇవాకా ట్రంప్‌ నేతృత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ ద్వారా తెలియజేశారు. ఇవాంకా రాకను స్వాగతిస్తూ ట్వీట్‌ చేసిన భారత ప్రధాని, అటుపై ట్రంప్‌ ట్వీట్‌ను కూడా రీట్వీట్‌ చేశారు.