శ్మశానవాటికకు విరాళం...అభినందనీయం - జయరామ్‌ కోమటి
Telangana Tourism
Vasavi Group
Manjeera Monarch

శ్మశానవాటికకు విరాళం...అభినందనీయం - జయరామ్‌ కోమటి

18-08-2017

శ్మశానవాటికకు విరాళం...అభినందనీయం - జయరామ్‌ కోమటి

మానవుని చివరి స్థలం శ్మశానవాటిక అభివృద్ధికి ఎన్నారైలు ముందుకు రావడం అభినందనీయమని అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి అన్నారు. ఎపి జన్మభూమి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని పలు చోట్ల ఉన్న శ్మశానవాటికలను అభివృద్ధి చేయాలన్న పిలుపుకు ముందుకు వచ్చిన ఎన్నారైలకు, వారి బంధుమిత్రులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. లొల్లలో ఎన్నారై, ఎన్నార్జీయస్‌ సంయుక్త భాగస్వామ్యంలో రూ.9 లక్షలతో నిర్మించిన హిందూ శ్యశాన వాటికను ఆయన పరిశీలించారు. వేణుగోపాలస్వామి కల్యాణమండపంలో సర్పంచి పాండ్రాకుల గంగరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అందరికీ కార్పొరేట్‌ విద్య అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో డిజిటల్‌ తరగతులు, అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణం, శ్మశనా వాటికల ఆధునికీకరణకు ఎన్నారైలు చేయూత ఇస్తున్నారన్నారు. తండ్రి కంపూడి రామారావు జ్ఞాపకార్థం విశాఖలో స్థిరపడిన కంటిపూడి కృష్ణ రూ.3 లక్షలు శ్మశాన వాటికకు విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు.