న్యూయార్క్‌ ఇండియా డే పెరేడ్‌లో రానా, తమన్నా

న్యూయార్క్‌ ఇండియా డే పెరేడ్‌లో రానా, తమన్నా

21-08-2017

న్యూయార్క్‌ ఇండియా డే పెరేడ్‌లో రానా, తమన్నా

భారత 71వ స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని భారతీయులు ఇండియా డే పెరెడ్‌ను న్యూయార్క్‌లో నిర్వహించారు. న్యూయార్క్‌, న్యూజెర్సి, కనెక్టికట్‌లకు చెందిన భారతీయ సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఎ) ఆధ్వర్యంలో జరిగిన ఈ పెరెడ్‌లో బాహుబలి నటుడు రానా దగ్గుబాటి, తమన్నా భాటియా పాల్గొన్నారు. మన్‌హట్టన్‌లోని మాడిసన్‌ అవెన్యూలో ఈ సందర్భంగా జరిగిన ప్రదర్శనలో ఎంతోమంది భారతీయులు భారత జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని జై భారత్‌ అంటూ నినదించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.