ఇండియా డే పెరేడ్ లో పాల్గొన్న ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

ఇండియా డే పెరేడ్ లో పాల్గొన్న ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ

21-08-2017

ఇండియా డే పెరేడ్ లో పాల్గొన్న ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ

ఈ రోజు "ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(ఎఫ్ఐఏ) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో నిర్వహించిన ఇండియా డే పెరేడ్‌లో "ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ, న్యూయార్క్ లో భారత స్వతంత్ర దినోత్సవాన్ని గౌరవిస్తూ  జరిగిన ఇండియా డే పెరేడ్ లో పాల్గొనడం జరిగింది. ఈ ఇండియా డే పరేడ్లో  సినీ హీరో, రానా దగ్గుబాటి మరియు తమన్నాభాటియా ముఖ్య అతిధులుగా పాల్గొన్ని సందడి చేసారు.

ఓఎఫ్ బిజెపీ టీంను, ఓఎఫ్ బిజెపీ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు ముందారుండి నడిపారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ, భారత దేశ వాసులందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ఓఎఫ్ బిజెపీ తరపున తెలిపారు.    

ఓఎఫ్ బిజెపీ సభ్యులు ఈ సందర్భముగా , "వన్ నేషన్ - వన్ టాక్స్ ", "సబ్ కా  సాథ్ -సబ్ కా  వికాస్", "ఏక్ భారత్ - శ్రేష్ట్ భారత్ " వంటి నినాదాలతో న్యూయార్క్ విధుల్లో ప్రజలను ఆకట్టుకున్నారు. పెరేడ్ ను వీక్షిండానికి వచ్చిన ప్రవాస భారతీయులు మరియు న్యూయార్క్ ప్రజలు , "మోడీ- మోడీ " అని నినాదాలు చేసారు. 

ఈ కార్యక్రమానికి, ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు, ఓఎఫ్ బిజెపీ మాజీ జాతీయ అధ్యక్షులు శ్రీ జయేష్ పటేల్, ఓఎఫ్ బిజెపీ కార్యవర్గ సభ్యులు, శ్రీ నీలిమ మదన్ గారు, శ్రీ కల్పనా శుక్ల గారు, ఓఎఫ్ బిజెపీ న్యూయార్క్ కోఆర్డినేటర్ శ్రీ శివదాసాన్ నాయర్ గారు, ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ కో-కోర్డినేటర్ శ్రీ ఆనంద్ జైన్ గారు, ఓఎఫ్ బిజెపీ మీడియా కో-కన్వీనర్లు  శ్రీ జయశ్రీ నాయర్ గారు,  శ్రీ దిగంబర్ ఇస్లాంపురే గారు, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్, శ్రీ విలాస్ రెడ్డి జంబుల గారు, ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యువ కన్వీనర్  శ్రీ పార్తీబన్ వర్ధన్,  శ్రీ వంశీ యంజాల, మరియు ఇతర ఓఎఫ్ బిజెపీ నేతలు పాల్గొన్నారు.