బే ఏరియాలో ఇండియా డే వేడుకలు
Sailaja Reddy Alluddu

బే ఏరియాలో ఇండియా డే వేడుకలు

26-08-2017

బే ఏరియాలో ఇండియా డే వేడుకలు

ఇండో అమెరికన్స్‌ అసోసియేషన్‌ (ఎఐఎ), బాలీ 92.3, దేశీ 1170 ఎఎం ఆధ్వర్యంలో స్వదేశ్‌ పేరుతో నిర్వహించిన ఇండియా ఇండిపెండెన్స్‌ డే వేడుకలకు మంచి స్పందన వచ్చింది. బే ఏరియాలో ఉన్న దాదాపు 30 ఇండియన్‌ ఆర్గనైజేషన్‌లు ఇందులో పాలుపంచుకున్నాయి. 25,000మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. టైటిల్‌ స్పాన్సర్‌ ఁడుహ, సంజీవ్‌గుప్తా సిపిఎ ప్రజంట్‌ చేసిన ఈ వేడుకల్లో రియల్టర్‌ మను చంగోత్ర ముఖ్య స్పాన్సర్‌గా, వెల్స్‌ ఫర్గో గ్రాండ్‌ స్పాన్సర్‌గా, క్లాసిక్‌ డైమండ్స్‌ గోల్డ్‌ స్పాన్సర్‌గా, రియోబి, కర్రీ పిజ్జా సిల్వర్‌ స్పాన్సర్‌గా వ్యవహరించాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిఎ, 24 మంత్ర, మున్షి జి 24లి7, స్వదేశ్‌ ఇండియన్‌ బజార్‌లు కూడా ఈ వేడుకలకు స్పాన్సర్లుగా ఉన్నాయి.

ఛోటా భీమ్‌, చుట్కీ, బాహుబలి, బాల కృష్ణ, స్పైడర్‌మ్యాన్‌, కెప్టెన్‌ అమెరికా లాంటి వేషధారణ చేసిన వాళ్ళతో ఫోటోలను దిగేందుకు చాలామంది ఉత్సాహం చూపించారు. మరోవైపు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా కూచిపూడి, భరతనాట్యం, కథక్‌, భాంగ్రా ఇతర క్లాసికల్‌ నృత్యాలతో కళాకారులు అందరినీ ఆనందింపజేశారు. బాలీవుడ్‌ డ్యాన్స్‌లు కూడా ప్రదర్శించారు. దేశీఫుడ్‌ లో భాగంగా ఏర్పాటు చేసిన వంటకాలు నోరూరించాయి. రియల్‌ ఎస్టేట్‌, దుస్తులు, నగల వర్తకులతోపాటు ఇతరులు కూడా తమ తమ స్టాళ్ళను ఏర్పాటు చేసి వ్యాపారం చేశారు. వేడుకలకు వచ్చినవాళ్ళకోసం వివిధ పోటీలను కూడా ఏర్పాటు చేశారు. పరుగు పందాలు, పిక్నిక్‌ గేమ్స్‌లలో చాలామంది వయస్సు భేదం లేకుండా పాల్గొన్నారు.

ప్రముఖ నటుడు ఆర్‌. మాధవన్‌ ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పెరెడ్‌కు ఆయన నాయకత్వం వహించారు. ఇండియన్‌ కాన్సులేట్‌ అధికారి ప్రదీప్‌ యాదవ్‌, అసెంబ్లీ మెంబర్‌ యాష్‌ కల్రా, అసెంబ్లీ మెంబర్‌ కన్సన్‌ చు, ప్రదీప్‌ గుప్తా (మేయర్‌, సౌత్‌ శాన్‌ఫ్రాన్సిస్కో), సవితా వైద్యనాథన్‌ (కుపర్టినో మేయర్‌), లిలి మే (ఫ్రీమాంట్‌ మేయర్‌), క్రిష్టెన్‌ కీత్‌ (మెన్లో పార్క్‌ మేయర్‌) నందిని నారాయణ్‌, కమ్యూనిటీ నాయకులు డా. హమేష్‌ కుమార్‌ తదితర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.