హార్వే బాధితులకు ఏపీఎన్‌ఆర్‌టీ చేయూత

హార్వే బాధితులకు ఏపీఎన్‌ఆర్‌టీ చేయూత

01-09-2017

హార్వే బాధితులకు ఏపీఎన్‌ఆర్‌టీ చేయూత

హార్వే తుఫాన్‌తో అతలాకుతలమైన టెక్సాస్‌ బాధితులను ఆదుకునేదుకునేందుకు ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు (ఏపీఎన్‌ఆర్‌టీ) సొసైటీ సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తుఫాను బాధితులు సహాయ సహకారాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా బాధితుల సమచారాన్ని తెలియజేస్తూనే, వారికి సహకరించేందుకు దాతలను ఆహ్వానించాలని, ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా కోరేందుకు ఏపీఎన్‌ఆర్‌టీ సన్నద్ధమైంది.