అమెరికాలో తగ్గిన తుఫాను ప్రభావం

అమెరికాలో తగ్గిన తుఫాను ప్రభావం

01-09-2017

అమెరికాలో తగ్గిన తుఫాను ప్రభావం

 అమెరికాలో వారం రోజులపాటు బీభత్సం సృష్టించిన హార్వే హరికేన్ శాంతించింది. దీంతో అధికారులు, సిబ్బంది సహాయక చర్యలను ఉధృతం చేశారు. హార్వే బాధితుల సహాయార్థం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా రూ.6.4 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో వేలాది మంది విపత్తు నిర్వహణ సిబ్బంది బోట్లు, హెలికాప్టర్ల సహాయంతో నలుమూలలా వెతుకుతూ బాధితులను రక్షిస్తూ, సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు.